
సినిమాలు

భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య కీలక వాణిజ్య చర్చలు ఈరోజు (మంగళవారం) జరగనున్నాయి. ఈ చర్చల్లో భాగంగా కార్ల దిగుమతులపై ఉన్న టారిఫ్లను భారత్ 40 శాతానికి తగ్గించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇది ఆటోమొబైల్ రంగానికి పెద్ద ప్రోత్సాహం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నిర్ణయం వల్ల €15,000 కు పైగా ధర ఉన్న యూరోపియన్ కార్ల ధరలు భారత్లో తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు మంచి లాభం కలగనుందని అంచనా. యూరోప్ నుంచి వచ్చే ప్రీమియం కార్లు మరింత అందుబాటులోకి రావచ్చని అంటున్నారు.
ఇక ఈ ఒప్పందం భారత్ – ఈయూ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆటో రంగంలో పోటీ పెరిగి, మార్కెట్ మరింత విస్తరించనుందని అంచనా వేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!