

హోండా కార్స్ ఇండియా తమ ప్రముఖ సెడాన్ హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ కారు ధర రూ.12 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. మధ్యస్థాయి సెడాన్ విభాగంలో ఇది హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్చూస్ కార్లతో పోటీపడనుంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రీమియం లైటింగ్, ఆధునిక క్యాబిన్ థీమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ వాచ్ వంటి ఫీచర్లు అందించారు. అలాగే 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
2030 నాటికి భారత మార్కెట్‌లో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. కంపెనీ సీఈఓ టకాషి నకజిమా ప్రకారం, వీటిలో ఎలక్ట్రిక్ కారు మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఉంటాయి. ప్రీమియం ఎస్‌యూవీ హోండా జడ్‌ఆర్-వీ ప్రదర్శన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో హోండా తమ తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. సిటీ హైబ్రిడ్, జడ్‌ఆర్-వీ హైబ్రిడ్‌లతో కలిపి ఈ ఏడాది మొత్తం 6 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!