

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మోరీ తహసీల్ పరిధిలోని పావనీ గ్రామంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పలు నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), రెవెన్యూ శాఖ బృందాలను ఘటనాస్థలికి పంపించింది. అగ్నిప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు, నిరాశ్రయులైన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి, వారిని ఆదుకోవాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!