

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఆయన భద్రతను ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీకి కల్పించిన భద్రతను తొలగించడం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదని, ఆయన హత్యకు గురయ్యేలా ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని ఆమె ఆరోపించారు. తన పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) గురించి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో జరిగిన సంభాషణలో ఆమె ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ చేపట్టిన పర్యటనలను కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. ఆ సమయంలో ఆయన ఓపెన్ జీపులో ప్రయాణించేవారని, పలు ప్రాంతాల్లో నిరసనలు, రాళ్ల దాడులను ఎదుర్కొన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన భద్రతను ఉపసంహరించుకోవడం తనకు తీవ్ర ఆందోళన కలిగించిందని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక ఉద్దేశపూర్వక చర్య ఉందన్న సోనియా గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!