

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌తో పాటు అంతర్జాతీయ స్టీల్ మార్కెట్‌పై కూడా పడే అవకాశముందని బిగ్‌మింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ గ్రేడ్ ముడి చమురు ధర ప్రస్తుతం 90 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం త్వరగా ముగియకపోతే, ముడి చమురు ధరలు 100 నుంచి 120 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే సమయంలో నౌకా రవాణా చార్జీలు కూడా దాదాపు 40 శాతం వరకు పెరిగాయి. ఈ పెరుగుదల స్టీల్ పరిశ్రమకు అవసరమైన ప్రధాన ముడి పదార్థాల సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
దీంతో దేశీయ స్టీల్ కంపెనీలు ధరలను పెంచే పరిస్థితి ఏర్పడవచ్చని బిగ్‌మింట్ రీసెర్చ్ అంచనా వేసింది. లేదంటే పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను భరించడం కష్టమై, స్టీల్ కంపెనీల అమ్మకాలు మరియు లాభాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!