
సినిమాలు

ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వినియోగంపై ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వాహనాలను దృష్టిలో ఉంచుకుని ఈ10 పెట్రోల్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత 20 శాతం ఇథనాల్ కలయిక లక్ష్యాన్ని మించి ముందుకు వెళ్లే ముందు ఆహారం, ఇంధనం మధ్య సమతుల్యతను సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
పాత వాహనాలన్నీ దశలవారీగా తొలగించే వరకు ఈ20తో పాటు ప్రత్యామ్నాయంగా ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని నాగేశ్వరన్ సూచించారు. ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే విధానంలో వాహనాల అనుకూలతతో పాటు ఆహార భద్రత, ఇంధన అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు దేశంలో ఇథనాల్ కలయిక విధానంపై మరోసారి చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!