

చేతిలో నగదు లేకపోయినా, కొద్దిపాటి బంగారం ఉంటే చాలు. బ్యాంకు లేదా ఎన్బీఏఫ్సీ వద్ద బంగారాన్ని హామీగా పెట్టి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడంతో, గత ఏడాది నుంచి గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపారం వేగంగా పెరుగుతోంది.
ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి దేశంలోని గోల్డ్ లోన్ ఎన్బీఏఫ్సీలు బంగారం మరియు ఆభరణాలను హామీగా పెట్టి ఇచ్చిన రుణాల మొత్తం విలువ రూ.14.5 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోల్చితే 36 శాతం ఎక్కువ. వచ్చే మార్చి నాటికి ఈ మార్కెట్ రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరపతి రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేస్తోంది.
ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 60 శాతం పెరిగాయి.
సూక్ష్మ రుణ సంస్థలు హామీ లేని రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.
దీంతో మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు గోల్డ్ లోన్ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు.
కొన్ని ఎన్బీఏఫ్సీలు బంగారం విలువలో 70–80 శాతం వరకు రుణం ఇస్తున్నాయి.
వచ్చే సంవత్సరం కూడా ఇదే డిమాండ్ కొనసాగుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం గోల్డ్ లోన్ మార్కెట్ 30–35 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, గోల్డ్ లోన్ కంపెనీలు వచ్చే ఏడాది 3000 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.
వీటిలో 1,800 బ్రాంచ్‌లు ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, బజాజ్ ఫైనాన్స్, IIFL ఫైనాన్స్ వంటి ప్రముఖ ఎన్బీఏఫ్సీలవే.
ఎల్అండ్టీ ఫైనాన్స్, పూనావాలా ఫిన్‌కార్ప్ కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.
జియో ఫైనాన్స్ కూడా త్వరలో గోల్డ్ లోన్ మార్కెట్లో ప్రవేశించనున్నట్టు సమాచారం.
మొత్తం మీద, బంగారం ధరల పెరుగుదల దేశంలో గోల్డ్ లోన్ వ్యాపారం మరింత విస్తరించడానికి దారితీస్తోంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!