

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో 2019-20 సిరీస్-VII సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGB) పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి. 2019 డిసెంబర్ 10న జారీ చేసిన ఈ బాండ్లకు సంబంధించి ముందస్తు రిడెంప్షన్ తేదీగా జూన్ 10ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. గ్రాము బంగారం రిడెంప్షన్ ధరను రూ.15,275గా నిర్ణయించింది.
ఈ బాండ్లు జారీ చేసిన సమయంలో గ్రాము బంగారం ధర రూ.3,745 మాత్రమే. ప్రస్తుతం రిడెంప్షన్ ధర రూ.15,275కు చేరడంతో పెట్టుబడిదారులు గ్రాముపై రూ.11,530 లాభం పొందుతూ 307.87% రాబడిని నమోదు చేశారు. డిజిటల్ చెల్లింపులతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అదనంగా గ్రాముపై రూ.50 రాయితీ లభించడంతో మొత్తం రాబడి 313.39%కు చేరింది. దీనికి తోడు ఏటా 2.5% వడ్డీ కూడా లభించింది. ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉన్న ఈ బాండ్లను ఐదో సంవత్సరం తర్వాత ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!