
సినిమాలు

బాలీవుడ్లో అత్యంత అభిమానాన్ని సంపాదించిన జంటల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఒకరు. కియారా పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చేసిన ప్రేమపూర్వక పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది. ‘నా ఐస్క్రీమ్ దొంగిలించి తిన్నా సరే, నా ప్రతి రోజును తీపి జ్ఞాపకంగా మార్చే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఆయన చిలిపిగా శుభాకాంక్షలు తెలిపారు.
సిద్ధార్థ్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా కియారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అందమైన జంటపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రేమాభిమానాలు మరోసారి నెటిజన్లను ఆకట్టుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!