
జనరల్

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. కేంద్రం లీటర్కు సుమారు రూ.3 వరకు ధరలు పెంచడంతో హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ ధర రూ.110 దాటగా, డీజిల్ ధర రూ.100కు చేరువైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో మరిన్ని ధరల పెంపులు ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం లీటర్ పెట్రోల్ రూ.84.99, డీజిల్ రూ.80.64కే లభిస్తోంది. తక్కువ వ్యాట్, ప్రత్యేక రాష్ట్ర పన్నులు లేకపోవడం వల్ల అక్కడ ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇంధన ధరలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!