
సినిమాలు

ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్,హెచ్పీసీఎల్) రోజుకు రూ.1,600–1,700 కోట్ల భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశంలో ఇంధన ధరలు పెంచకపోవడంతో ఈ సంస్థలపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పెరిగింది. గత 10 వారాల్లోనే నష్టం రూ.లక్ష కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని అంచనా.
ప్రస్తుతం ఈ సంస్థలు అధిక ధరలకు ముడి చమురు కొనుగోలు చేసి తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. దీంతో అప్పులు చేసి కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పరిస్థితి కొనసాగితే ఇంధన ధరల సవరణ తప్పనిసరి కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!