

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆమోదంతో శంఖ్ ఎయిర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మూడు కొత్త విమాన సంస్థలకు అనుమతి లభించగా, వాటిలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి వస్తున్న తొలి స్వదేశీ ఎయిర్‌లైన్‌గా శంఖ్ ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ ఎయిర్‌లైన్ ఫౌండర్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవితం టెంపో డ్రైవర్‌గా ప్రారంభమైంది. కాన్పూర్‌లోని పేద కుటుంబంలో జన్మించిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసి జీవనోపాధి కోసం కష్టపడ్డాడు. అయినా వ్యాపారవేత్తగా ఎదగాలనే కలను వదలకుండా ముందుకు సాగాడు.
సిమెంట్, స్టీల్, బిల్డింగ్ మెటీరియల్స్, రవాణా, మైనింగ్ రంగాల్లో విజయాలు సాధించిన అనంతరం 2023 లో శంఖ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించాడు. 2025 డిసెంబర్లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందిన శంఖ్ ఎయిర్, 2026 జనవరి – ఫిబ్రవరిలో మూడు ఎయిర్‌బస్ విమానాలతో సేవలు ప్రారంభించనుంది. లక్నో నుంచి ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు, ఆపై వారణాసి, గోరఖ్‌పూర్ రూట్లకు విస్తరించనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!