దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్–యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అలాగే రూపాయి విలువ పుంజుకోవడం కూడా మార్కెట్లకు అనుకూలంగా మారింది.
ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 82,217 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 136 పాయింట్లు లాభపడి 25,311 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు దూసుకెళ్లింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.57గా నమోదైంది. నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, రిలయన్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.




.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!