

జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్రయాణికులు భారీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా ఛార్జీల పెంపు డిమాండ్‌తో ఈ రోజు నుంచి మూడు రోజుల ‘చక్కా జామ్’ ఆందోళన ప్రారంభమైంది. టాక్సీ ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు సహా రవాణా రంగానికి చెందిన అనేక మంది విధులకు దూరంగా ఉండడంతో నగర రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్‌కు చెందిన దాదాపు 68 యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.
ఈ సమ్మె కారణంగా ఆటో రిక్షాలు, టాక్సీలు, అలాగే ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయితే ఢిల్లీ మెట్రో, డీటీసీ బస్సులు యథాతథంగా కొనసాగనున్నాయి. గత 15 సంవత్సరాలుగా టాక్సీ ఛార్జీలు పెరగలేదని, సీఎన్జీ ధరలు, పర్మిట్, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగినా ప్రభుత్వం స్పందించలేదని యూనియన్లు పేర్కొన్నాయి. రెండు వారాల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!