

రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగం, జాతీయ భద్రతలో దాని పెరుగుతున్న ప్రాధాన్యంపై భారత సైన్యంలోని ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, సాంకేతిక భాగస్వాములు మరియు పరిశ్రమ ప్రతినిధులు చర్చించేందుకు డిఫ్శాట్ నాలుగో ఎడిషన్ సదస్సు వేదిక కానుంది. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో జరగనున్న ఈ సదస్సు దేశ రక్షణ సన్నద్ధతలో అంతరిక్ష రంగం పాత్రను ప్రధానంగా చర్చించనుంది.
శాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్ఐఏ) ఇండియా అధ్యక్షుడు సుబ్బారావు పావులూరి తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు మిలిటరీ లేదా డ్యుయల్ యూజ్ శాటిలైట్లను వినియోగిస్తున్నాయి. డిఫ్శాట్-2026లో సుమారు 20 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, 20 మందికి పైగా వక్తలు, దాదాపు 60 సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్ల కేటాయింపు నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ రక్షణలో ముందస్తు సన్నద్ధత కోసం భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని ఎస్ఐఏ ఇండియా డైరెక్టర్ జనరల్ అనిల్ ప్రకాశ్ పేర్కొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!