ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో భారత్కు పెద్ద ఉపశమనం లభించింది. ఇంధన సరఫరా విషయంలో ఏర్పడిన అనిశ్చితి మధ్య అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చింది.
అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ ప్రకారం, భారత్ రష్యా నుంచి 30 రోజులపాటు ముడిచమురు కొనుగోలు చేయవచ్చు. ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం భారత్కు ఇంధన సరఫరా పరంగా ఉపశమనంగా భావిస్తున్నారు.
ఈ అనుమతి ద్వారా దేశంలో ఇంధన అవసరాలను కొంతవరకు స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, రష్యా నుంచి చమురు దిగుమతులకు లభించిన ఈ అనుమతి భారత్కు తాత్కాలికంగా ఊరటనిచ్చింది.




.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!