

రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో అక్రమంగా కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడిని ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించి పాల వ్యాపారి అండే శ్రీశైలం (43)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడి సందర్భంగా పోలీసులు 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను సీజ్ చేశారు. పాలలో రసాయన పదార్థాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా అవుతున్న పాల నాణ్యత, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!