

అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ భారత్‌లో చెల్లింపుల సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో పాటు వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అన్ని అంశాలు అనుకూలంగా ఉంటే, ఈ ఏడాది మధ్య నాటికి గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం వంటి సంస్థలకు పోటీగా యాపిల్ పే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై సంబంధిత సంస్థలు అధికారికంగా స్పందించలేదు. యూపీఐతో పాటు కార్డు ఆధారిత చెల్లింపులకు కూడా యాపిల్ పే మద్దతు ఇవ్వొచ్చని అంచనా.
భారత్‌లో 75 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉండటం, తక్కువ ధరలో డేటా అందుబాటులో ఉండటం వంటి అంశాలు యాపిల్‌ను భారత మార్కెట్‌పై దృష్టిసారించేలా చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆధిపత్యం ఉన్నప్పటికీ, యాపిల్ తన తయారీ కేంద్రాలు మరియు రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. తాజాగా ముంబయిలో తన ఆరో స్టోర్‌ను ప్రారంభించింది. యాపిల్ పే ప్రారంభమైతే యాపిల్ వాచ్‌లు, ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌ల విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సుమారు 10 శాతం వాటా కలిగిన యాపిల్‌కు భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
.webp&w=3840&q=75)







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!