

దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.26,572 కోట్ల రుణాలు తీసుకుని దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా నమోదైంది. ఈ విషయాన్ని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానంగా వెల్లడించారు.
అదేవిధంగా 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.17,600 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,900 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో తొమ్మిది నెలల్లో మొత్తం రూ.56,072 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడైంది. ఈ రుణాల్లో ఎక్కువ భాగం ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా సేకరించగా, ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపుల కోసం కూడా కొత్త అప్పులు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!