

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి, ఆర్ఎక్స్ 100, మహాసముద్రం, మంగళవారం చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస మంగాపురం చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు. రషా తడాని కథానాయికగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ భూపతి, మోహన్ బాబుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. “మోహన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. నేను రెండు రోజులు ఫోన్ చేయకపోతే కూడా ఆయన బాధపడతారు. ఇది ఆయనకు నాపై ఉన్న ప్రేమకు నిదర్శనం. మనం ఎలా ఉంటామో ఎదుటివారు కూడా అలాగే ఉంటారు” అని తెలిపారు. అలాగే ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!