
సినిమాలు

కృష్ణా నది ఎగువ పరివాహ ప్రాంతాల నుంచి వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 79,403 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 824.80 అడుగులు, నిల్వ 44.6090 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో జూరాల జలాశయంలో ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయం జూరాలకు సుమారు 80వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం 47వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!