
జనరల్

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలను నెస్లే ఇండియా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఈ ఫిర్యాదు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఫిర్యాదుదారు నుంచి ఎలాంటి నమూనాలు అందలేదని, సంప్రదించడానికి ప్రయత్నించినా వివరాలు లభించలేదని పేర్కొంది.ఎన్‌ఏబీఎల్ పరీక్షల్లో మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ధృవీకరించబడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!