

ప్రపంచ ఏఐ రంగంలో నెలకొన్న అనిశ్చితి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మార్పుల ప్రభావంతో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. దేశ ప్రధాన సూచీ కోస్పి 8 శాతానికి పైగా క్షీణించడంతో అమ్మకాల ఒత్తిడి తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పడంతో కొరియా ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను 20 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే వారంలో ట్రేడింగ్ నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సెమీకండక్టర్ దిగ్గజాలు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనెక్స్ షేర్లు భారీగా పడిపోవడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
మెమొరీ చిప్‌ల కొరత, ఆపిల్ ఉత్పత్తుల ధరల పెంపు, ఓపెన్ఏఐ ప్రారంభ షేర్ విక్రయం (ఐపీఓ) వాయిదా పడే అవకాశాలపై వస్తున్న వార్తలు మార్కెట్‌లో ఆందోళనను మరింత పెంచాయి. వచ్చే వారం శామ్‌సంగ్, ఎస్‌కే హైనెక్స్ భారీ పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలు తగ్గలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత టెక్నాలజీ రంగ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!