10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

Writer: Pooja 09:31 AM, 10 సెప్టెంబర్, 2026
ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలోకి అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న యాపిల్‌ పార్క్‌లో ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ పేరుతో బుధవారం నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో ‘ఐఫోన్‌ డువో’ను కంపెనీ ఆవిష్కరించింది. కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత యాపిల్‌ విడుదల చేసిన తొలి ఉత్పత్తి ఇదే. ఏ20 ప్రో ప్రాసెసర్‌, 48 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 12 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాతో ఈ ఫోన్‌ రూపొందింది. రెండు తెరలకు విడివిడిగా బ్యాటరీలను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ కేవలం ఈ-సిమ్‌ సదుపాయంతోనే లభించనుంది. మడత పెట్టినప్పుడు 5.4 అంగుళాలు, తెరిచినప్పుడు 7.6 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుంది. 256 జీబీ మెమొరీతో ప్రారంభమయ్యే ఐఫోన్‌ డువో ధర 1,999 డాలర్లు. యాపిల్‌ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా నిలిచింది. స్టార్‌ వైట్‌, నైట్‌ స్కై రంగుల్లో లభించే ఈ ఫోన్‌ ఈ నెల 23న భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లలోకి రానుంది.

ఫోల్డబుల్‌ ఫోన్‌తో పాటు ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను కూడా యాపిల్‌ ఆవిష్కరించింది. ఐఓఎస్‌ 27 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ఏ20 ప్రో ప్రాసెసర్‌, మెరుగైన బ్యాటరీ, అధిక హార్డ్‌వేర్‌ పనితీరు, 48 మెగాపిక్సెల్‌ కెమెరా వంటి ఫీచర్లను వీటిలో అందించింది. డీప్‌ బ్లాక్‌, సిల్వర్‌, గ్లేసియర్‌ బ్లూ, బర్గండీ రంగుల్లో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ మెమొరీ సామర్థ్యాలతో ఇవి లభించనున్నాయి. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమై, 18 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. మరోవైపు మెరుగైన ఆరోగ్య, ఫిట్‌నెస్‌ ఫీచర్లతో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, వాచ్‌ అల్ట్రాను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి బుకింగ్‌లు బుధవారం నుంచే ప్రారంభమవుతాయి. అలాగే ఆధునిక నాయిస్‌ క్యాన్సలేషన్‌ సదుపాయంతో ఎయిర్‌పాడ్స్‌ 5ను కూడా లాంచ్‌ చేసింది. ఇది కూడా ఈ నెల 18 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

ట్యాగ్లు
యాపిల్‌ఐఫోన్‌ డువోఫోల్డబుల్ ఐఫోన్ఐఫోన్‌ 18 ప్రోయాపిల్‌ వాచ్‌ఎయిర్‌పాడ్స్‌ 5
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన
జనరల్

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?
జనరల్

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?
గాసిప్స్

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?
గాసిప్స్

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!