
షోస్

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు పెరుగుతుండటంతో దేశీయ ఇంధన ధరలపై మళ్లీ ఒత్తిడి పెరగనుంది. ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ఆదాయ నష్టాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.5, డీజిల్‌పై రూ.23 వరకు నష్టం వస్తున్నట్లు అంచనా.
క్రూడాయిల్ ధరలు మరింత పెరిగితే చమురు కంపెనీలపై ఆర్థిక భారం పెరగడంతో పాటు దేశీయ ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు సంస్థల మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముడిచమురు ధరల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!