

దేశంలో ఉద్యోగాల కొరతను తగ్గించేందుకు పారిశ్రామిక రంగం ముందుకు వచ్చింది. ‘100 మిలియన్ జాబ్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, వచ్చే పదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. నాస్కామ్ సహ వ్యవస్థాపకుడు హరీష్ మెహతా, టై వ్యవస్థాపకుడు ఏజే పటేల్, సీఐపీపీ వ్యవస్థాపకుడు కే. యతీష్ రాజావత్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 1.2 కోట్ల మంది ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తుండగా, అందులో సగం మందికే ఉపాధి లభిస్తోంది. నిరుద్యోగ సమస్య తగ్గాలంటే ఏటా కనీసం 80–90 లక్షల ఉద్యోగాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల లోపం కూడా ఉద్యోగాల కొరతకు కారణమవుతోంది.
ఈ కార్యక్రమం లక్ష్యాలు:
ఉపాధి నైపుణ్యాల శిక్షణ.
ఉద్యోగాలకే కేంద్రంగా ఆర్థిక అభివృద్ధి.
రంగాలు–ప్రాంతాల వారీగా ఉద్యోగ అవకాశాల గుర్తింపు.
ఎక్కువ ఉద్యోగాల కల్పన చేసే చిన్న పరిశ్రమలు, స్టార్ట్ప్ల ప్రోత్సాహం
ప్రధాన నగరాల వెలుపల పరిశ్రమల విస్తరణ సంస్థాగత అడ్డంకుల తొలగింపు.
ప్రభుత్వం–పరిశ్రమలు–సమాజం మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!