

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లో తన వీ70 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే వీ70, వీ70 ఎలైట్ మోడళ్లను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు వీ70 ఎఫ్‌ఈను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 200 మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
వివో వీ70 ఎఫ్‌ఈలో 6.83 అంగుళాల 1.5K ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండగా, 120Hz రిఫ్రెష్ రేటు, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌పై పనిచేస్తూ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో రన్ అవుతుంది. ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించేలా రూపొందించారు. ఫోటోగ్రఫీ పరంగా వెనుక భాగంలో OISతో కూడిన 200 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉండగా, ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. అదనంగా IP68, IP69 రేటింగ్‌తో పాటు NFC, GPS, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబడింది, కేవలం 60 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ధరల విషయానికి వస్తే, 8GB+128GB వేరియంట్ ధర రూ.37,999గా ఉండగా, 8GB+256GB వేరియంట్ రూ.40,999, 12GB+256GB వేరియంట్ రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మాన్‌సూన్ బ్లూ, పర్పుల్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ఏప్రిల్ 9 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. అదనంగా రూ.1499 చెల్లిస్తే వివో టీడబ్ల్యూఎస్ 3ఈ హెడ్‌సెట్‌ను ప్రత్యేక డిస్కౌంట్ ధరలో అందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!