
రాజకీయాలు

మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు హనీ త్రేహాన్ 'పంజాబ్ 95' పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించారు. పంజాబ్‌లో జరిగిన అనుమానాస్పద ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తీసుకువచ్చిన ఖల్రా జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
సినిమా పూర్తై మూడు సంవత్సరాలు గడిచినా, సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ సూచించడంతో థియేటర్లలో విడుదల కాలేకపోయింది. అనంతరం చిత్రానికి 'సత్లుజ్' అనే కొత్త పేరు పెట్టి నేరుగా జీ5 ఓటీటీలో విడుదల చేశారు. ఉత్తర భారత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, దక్షిణాది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!