

66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి చాలా వేడి వాతావరణంలో ఉండేది. ఆ తర్వాత భూమి ఎలా చల్లబడుతూ, నేటి మంచుతో కప్పబడిన ప్రపంచంగా మారిందో అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానం కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ నేతృత్వంలో చేసిన అధ్యయనంలో, ఈ కాలంలో సముద్రాల్లోని క్యాలిషియం స్థాయులు 50 శాతం కంటే ఎక్కువగా తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు PNAS అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. క్యాలిషియం తగ్గడం వల్ల గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కూడా తగ్గి, భూమి వాతావరణం క్రమంగా చల్లబడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పురాతన సముద్ర జీవాల అవశేషాలను పరిశీలించినప్పుడు, అప్పటి సముద్రాల్లో ఇప్పటికంటే రెండు రెట్లు ఎక్కువ క్యాలిషియం ఉన్నట్లు తెలిసింది. క్యాలిషియం ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రాలు తక్కువ కార్బన్‌ను నిల్వ చేసేవని, క్యాలిషియం తగ్గినప్పుడు ఎక్కువ కార్బన్‌ను గ్రహించేవని కంప్యూటర్ అధ్యయనాలు చూపించాయి. అలాగే సముద్ర జీవాల మార్పులు, సముద్రపు అడుగు విస్తరణ తగ్గడం, భూమి లోతుల్లో జరిగే రసాయన మార్పులు కలిసి భూమి వాతావరణం మారడంలో ముఖ్య పాత్ర పోషించాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!