

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ తన నోట్ 17 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 17 ప్రో, రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వరుసగా 9,000mAh, 10,000mAh భారీ బ్యాటరీలను అందించింది. రెండు ఫోన్లలోనూ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, IP66+IP68+IP69K రేటింగ్స్ ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 10,000mAh బ్యాటరీకి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు. 8GB+256GB వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12GB+256GB వేరియంట్ రూ.55,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఇక నోట్ 17 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్, 50MP+8MP వెనుక కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 9,000mAh బ్యాటరీకి 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.36,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. సెప్టెంబర్ 17 నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తక్షణ రాయితీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!