

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మెసేజింగ్ యాప్‌లపై ప్రతిపాదించిన సిమ్ బైండింగ్ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు. టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం WhatsApp, Telegram వంటి యాప్‌లు వినియోగదారుడి యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. సిమ్ తొలగించినా లేదా డీయాక్టివేట్ అయినా సేవలు వెంటనే నిలిచిపోతాయి. వెబ్ వెర్షన్లు ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతాయి.
ఈ నిబంధనలకు ఇచ్చిన 90 రోజుల గడువు వచ్చే నెల 28, 2026 తో ముగుస్తుందని, దానిని పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జాతీయ భద్రతే ప్రధానమని, ఇందులో రాజీ ఉండదని తెలిపారు. ఏజీఆర్ ఉపశమనంపై సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో Starlink అవసరమైన భద్రతా ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపు జరుగుతుందని వివరించారు.
.webp&w=3840&q=75)







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!