
జనరల్

దేశీయ సెమీకండక్టర్స్ రంగంలో హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ సెమీకండక్టర్స్ కీలక ఆవిష్కరణను చేసింది. గ్లోబల్ టెక్ సంస్థ నావిటాస్ సెమీకండక్టర్స్ సహకారంతో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్యాలియం నైట్రైడ్ (గ్యాన్ పవర్) పవర్ ఐసీలును ఆవిష్కరించింది. ఇవి భారత్‌లో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చిన తొలి గ్యాన్ పవర్ ఐసీ ఉత్పత్తులుగా నిలిచాయి.
650 వోల్ట్స్ సామర్థ్యంతో పనిచేసే ఏడు ఆధునిక పరికరాలను సంస్థ విడుదల చేసింది. ఇవి ఎడ్జ్ ఏఐ, ఈ-మొబిలిటీ, ఏఐ డేటా సెంటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పారిశ్రామిక పవర్ సిస్టమ్స్ కోసం రూపొందించబడ్డాయి. జూన్ నుంచి వీటిని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. భారత్ నావిటాస్ వృద్ధి వ్యూహంలో కీలక మార్కెట్ అని కంపెనీ సీఈఓలు సుమన్ నారాయణ్ మరియు క్రిస్ అలెగ్జాండర్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!