

పశ్చిమాసియాలో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు దోహా వేదికగా మంగళవారం ఉన్నతస్థాయి చర్చలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా పరిస్థితులను మరింత ఉద్రిక్తం కాకుండా నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది.
హర్మూజ్ జలసంధికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నంత కాలం సైనిక చర్యలను చేపట్టకూడదని ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. కీలక సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమంపై స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన చర్చలను తాజా పరిస్థితుల కారణంగా దోహాకు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలపై అమెరికా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!