

మెటా తన రే-బాన్ డిస్ప్లే స్మార్ట్ గ్లాసెస్‌కు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్తో మెసేజింగ్, నావిగేషన్, యాక్సెసిబిలిటీ ఫీచర్లు మరింత విస్తరించాయి. ముఖ్యంగా Neural Handwriting ఫీచర్ ద్వారా వినియోగదారులు చేతి వేళ్ల జెస్టర్స్తోనే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వంటి యాప్‌లలో మెసేజ్‌లు టైప్ చేయగలరు. అలాగే గ్లాసెస్‌లో కనిపించే స్క్రీన్, కెమెరా వీడియో, ఆడియోను కలిపి ఒకే వీడియోగా రికార్డ్ చేసే కొత్త ఫీచర్‌ను కూడా మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికాతో పాటు లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. డెవలపర్ల కోసం ప్రత్యేక ప్రీవ్యూ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మెటా, HTML, CSS, JavaScript ద్వారా వెబ్ యాప్‌లను ఈ గ్లాసెస్‌కు అనుసంధానం చేసే అవకాశాన్ని కల్పించింది. త్వరలోనే Muse Spark అనే కొత్త AI మోడల్‌ను కూడా ఈ వేర్బుల్స్లో ప్రవేశపెట్టనున్నట్లు మెటా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!