

తమిళనాడులోని వేలూర్‌కు చెందిన 41 ఏళ్ల మహిళ పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె ఓ ఫోన్ నంబరుతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో లాగిన్ అయి, తన ఫొటోలతో పాటు బంధువుల చిత్రాలను అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత ఆ సిమ్‌కార్డును ఉపయోగించడం మానేశారు. దీంతో టెలికాం సంస్థ ఆ నంబరును మరో వ్యక్తికి కేటాయించింది. ఈ క్రమంలో ఆమె గతంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్‌కు పంపించడం ప్రారంభించారు.
దీంతో బాధితురాలు తాను గతంలో ఉపయోగించిన నంబర్‌కు ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి అశ్లీల ఫొటోలు పంపకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె వేలూర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, తేని జిల్లా వెంకటాచలపురానికి చెందిన వంట మాస్టర్ జ్యోతి వెంకటేశన్ (39)ను శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు తరలించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!