23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!

Writer: Harika S 10:59 AM, 23 నవంబర్, 2026
పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!

2026 పండుగల సీజన్‌లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త రికార్డు సృష్టించింది. 42 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏకంగా 55,25,490 వాహనాలు అమ్ముడయ్యాయి. ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా (Federation of Automobile Dealers Associations) సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే పండుగల సీజన్‌తో పోలిస్తే ఈసారి అమ్మకాలు 2.21 శాతం పెరిగాయి. 2025లో జీఎస్‌టీ 2.0 సంస్కరణల కారణంగా వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగినప్పటికీ, ఈసారి కూడా మార్కెట్ వృద్ధిని నమోదు చేసింది. 2024 పండుగల సీజన్‌తో పోలిస్తే 2026లో వాహనాల రిటైల్ అమ్మకాలు 23.95 శాతం పెరగడం విశేషం.

వాహనాల విభాగాల వారీగా చూస్తే టూ వీలర్ల అమ్మకాలు 3.67 శాతం పెరిగి 43,13,276 యూనిట్లకు చేరాయి. త్రీ వీలర్ల విక్రయాలు 5.32 శాతం వృద్ధితో 1,93,576 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వాహనాల అమ్మకాలు 7.13 శాతం పెరిగి 1,55,761 యూనిట్లకు చేరగా, ట్రాక్టర్ల విక్రయాలు 2.24 శాతం వృద్ధితో 1,03,809 యూనిట్లుగా నమోదయ్యాయి. కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ అమ్మకాలు ఏకంగా 26.06 శాతం పెరిగాయి. అయితే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మాత్రం 7.16 శాతం తగ్గి 7,48,616 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలే. ఈవీ అమ్మకాలు 52.62 శాతం పెరిగి తొలిసారిగా ఒకే పండుగల సీజన్‌లో 5 లక్షల మార్కును దాటాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు 61.10 శాతం, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 72.91 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల అమ్మకాలు రెట్టింపునకు మించి వృద్ధి చెందాయి. ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ, 2026 పండుగల సీజన్ భారత ఆటోమొబైల్ రిటైల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఒక క్యాలెండర్ ఏడాదిలో దేశంలో తొలిసారిగా మొత్తం వాహనాల అమ్మకాలు 3 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ఫాడా వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

160 ఏళ్ల గణిత సమస్యకు క్లాడ్‌ ఏఐతో పరిష్కారం కనుగొన్నట్లు ప్రకటన

160 ఏళ్ల గణిత సమస్యకు క్లాడ్‌ ఏఐతో పరిష్కారం కనుగొన్నట్లు ప్రకటన

భారత్‌లో కొత్త రూపంలో యాపిల్‌ మ్యాప్స్‌

భారత్‌లో కొత్త రూపంలో యాపిల్‌ మ్యాప్స్‌

GTA 6: సరికొత్త రికార్డులతో ప్రపంచ గేమింగ్ రంగంలో ప్రకంపనలు

GTA 6: సరికొత్త రికార్డులతో ప్రపంచ గేమింగ్ రంగంలో ప్రకంపనలు

ఐటీ హెల్ప్‌డెస్క్ పేరుతో వస్తున్న కాల్స్ వెనుక అసలు కథ ఇదే

ఐటీ హెల్ప్‌డెస్క్ పేరుతో వస్తున్న కాల్స్ వెనుక అసలు కథ ఇదే

ట్యాగ్లు
భారత వాహనాల అమ్మకాలు2026 పండుగల సీజన్ఎలక్ట్రిక్ వాహనాలుఈవీ అమ్మకాలుఫాడా నివేదికఆటోమొబైల్ రంగంటూ వీలర్ అమ్మకాలుప్యాసింజర్ వాహనాలుజీఎస్‌టీ 2.0భారత ఆటోమొబైల్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!
సినిమాలు

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు
జనరల్

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!
జనరల్

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జనరల్

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!
జనరల్

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి
జనరల్

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!
రాజకీయాలు

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
జనరల్

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
జనరల్

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన
బిజినెస్

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!