
సినిమాలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 225 పాయింట్లుగా నమోదైంది. దీంతో కాలుష్య తీవ్రత కొంత తగ్గినప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయి ఉపశమనం లభించలేదని తెలుస్తోంది.
అక్షరధామ్ పరిసరాల్లో, ఆనంద్ విహార్లో ఏక్యూఐ 237 పాయింట్లుగా నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. గాలి నాణ్యత సూచీ 201 నుంచి 300 మధ్య ఉంటే 'పూర్' (Poor) కేటగిరీగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య పరిస్థితులపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!