23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

Writer: Pooja 11:06 AM, 23 నవంబర్, 2026
ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

బిస్లెరి తాగునీటిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై బిస్లెరి ఇంటర్నేషనల్ స్పందించింది. తమ ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని, బిస్లెరి నీరు తాగడానికి సురక్షితమైనదేనని సంస్థ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ వివాదం మొత్తం ఉత్పత్తులకు సంబంధించినది కాదని, 2025 సెప్టెంబర్‌లో గోవాలోని తమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించినదని వెల్లడించింది. 2025 సెప్టెంబర్ 30న ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు గోవా ప్లాంట్ నుంచి ఆరు నీటి నమూనాలను సేకరించారని తెలిపింది. వీటిలో ఐదు నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలగా, ఆరో నమూనాలో లీటరు నీటికి 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారు. అనుమతించిన గరిష్ఠ పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే కావడంతో ఈ అంశం వివాదానికి దారితీసింది.

ఈ పరీక్ష ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2025 నవంబర్ 22న అప్పీల్ చేసుకున్నట్లు బిస్లెరి వెల్లడించింది. అనంతరం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆ నమూనాను రిఫరల్ ల్యాబ్‌కు పంపించి మరోసారి పరీక్షించిందని తెలిపింది. ఆ పరీక్షలో బ్రోమేట్ పరిమాణం అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని, అయితే పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు ల్యాబ్ గుర్తించిందని పేర్కొంది. రెండు పరీక్షల్లో వేర్వేరు ఫలితాలు రావడంతో మరింత స్పష్టత కోసం అదే నమూనాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదించిన మరో స్వతంత్ర ప్రయోగశాలలో పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. అక్కడ కూడా బ్రోమేట్ పరిమాణం అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఈ పరీక్ష నివేదికలను 2026 ఫిబ్రవరి 2న అధికారిక లేఖతో ఎఫ్ఎస్ఎస్ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించినట్లు పేర్కొంది.

నివేదికలు సమర్పించిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దీంతో ఈ వ్యవహారం ముగిసిపోయిందని భావించినట్లు బిస్లెరి తెలిపింది. తాజాగా వార్తల్లో వస్తున్న ప్రాసిక్యూషన్ నోటీసు కూడా తమకు ఈమెయిల్ ద్వారా గానీ, నేరుగా గానీ అందలేదని, ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్‌సైట్‌లోనూ గుర్తించలేకపోయామని పేర్కొంది. తాగునీటి భద్రత తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన సంస్థ, తయారీ ప్రక్రియలో 10 దశల్లో నాణ్యతా తనిఖీలు నిర్వహించడంతో పాటు 90కి పైగా పరీక్షలు చేస్తామని వెల్లడించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, నిబంధనల ప్రకారం ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుంటామని తెలిపింది. ప్రజల నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యమని, బిస్లెరి నీరు వినియోగానికి సురక్షితమైనదేనని సంస్థ పునరుద్ఘాటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ట్యాగ్లు
బిస్లెరిఎఫ్ఎస్ఎస్ఏఐబిస్లెరి నీటి వివాదంతాగునీటి నాణ్యతబ్రోమేట్ గుర్తింపుప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!
సినిమాలు

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు
జనరల్

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!
జనరల్

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జనరల్

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!
జనరల్

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి
జనరల్

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!
రాజకీయాలు

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
జనరల్

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
జనరల్

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన
బిజినెస్

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!