

దిల్లీలోని గూగుల్‌కు సేవలందిస్తున్న థర్డ్‌పార్టీ డేటా సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించడంతో భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా కొన్ని కీలక నెట్వర్కింగ్ పరికరాలు షట్‌డౌన్ కావడంతో పలు ప్రాంతాల్లో క్లౌడ్ సేవలు ప్రభావితమైనట్లు గూగుల్ క్లౌడ్ విభాగం వెల్లడించింది. ప్రమాదం ఎప్పుడు జరిగిందన్న విషయంపై సంస్థ స్పష్టత ఇవ్వలేదు. అలాగే ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ అంతరాయం కారణంగా దిల్లీ, చెన్నై, ముంబయి సహా పలు నగరాల్లో నెట్వర్క్ ట్రాఫిక్ ప్రభావితమైంది. క్లౌడ్ సేవలపై ఆధారపడే సంస్థల కార్యకలాపాలు తాత్కాలికంగా నెమ్మదించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని గూగుల్ తెలిపింది. ప్రపంచ క్లౌడ్ మార్కెట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్‌తో గూగుల్ క్లౌడ్ పోటీపడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!