
సినిమాలు

మొబైల్ వినియోగంలో త్వరలోనే పెద్ద మార్పులు రానున్నాయని నథింగ్ సంస్థ అధిపతి కార్ల్ పే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాప్‌ల ఆధారంగా ఉన్న విధానం దాదాపు 20 సంవత్సరాలుగా మారకుండా కొనసాగుతోందని, ఇది పాత విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఒక చిన్న పని పూర్తి చేయాలన్నా పలు యాప్‌ల మధ్య మారుతూ చేయాల్సి రావడం వినియోగదారులకు అసౌకర్యంగా మారిందని తెలిపారు.
భవిష్యత్‌లో ఏఐ ఆధారిత వ్యవస్థలు ఈ యాప్‌ల స్థానాన్ని తీసుకుంటాయని ఆయన అభిప్రాయం. వినియోగదారు చెప్పిన పనిని స్వయంచాలకంగా పూర్తి చేసే విధంగా ఈ వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపారు. ఈ మార్పుకు అనుగుణంగా అభివృద్ధి దారులు తమ సేవలను మార్చుకోవాలని సూచించారు. యాప్‌లు లేకుండా సులభమైన డిజిటల్ అనుభవం భవిష్యత్‌లో సాధ్యమవుతుందని పేర్కొన్నారు.



.jpg&w=3840&q=75)


.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!