

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఆపిల్ పే అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం అక్టోబర్‌లో ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉంది. తొలిదశలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఆపిల్ పే సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా పీవోఎస్ మెషీన్ల వద్ద ట్యాప్ చేసి చెల్లింపులు చేసే సదుపాయం ఉండనుంది.
ప్రస్తుతం భారత్‌లో యూపీఐ ఆధారిత చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో ఉండగా, ఆపిల్ పే ప్రారంభంలో యూపీఐ కి మద్దతు ఇవ్వకపోవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే భవిష్యత్తులో యూపీఐ ని కూడా ఆపిల్ పే లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని మరో నివేదిక పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులతోనూ ఆపిల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యూపీఐ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తే భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో ఆపిల్ పే పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!