

ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఇటీవల విడుదల చేసిన ఫ్యాబిల్ 5, మిథోస్ 5 ఏఐ మోడళ్ల సేవలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మోడళ్లలో భద్రతాపరమైన లోపాలు గుర్తించబడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భద్రతా ఫిల్టర్లను దాటవేసే అవకాశమున్న కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడినట్లు తెలుస్తోంది.
అమెజాన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరీక్షల్లో ప్రత్యేక ప్రాంప్ట్‌ల ద్వారా సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, ఈ మోడళ్లను విదేశీ పౌరులు వినియోగించకుండా ఆంక్షలు విధించినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య, ఆంథ్రోపిక్ సంస్థ ఫ్యాబిల్ 5, మిథోస్ 5 సేవలను అన్ని వినియోగదారులకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!