
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్ వీడియో తొలగింపు ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటాను వివరణ కోరింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు అందించేందుకు సంస్థ అత్యున్నత ప్రతినిధులు వచ్చే పది రోజుల్లో ప్రభుత్వ అధికారుల ఎదుట హాజరుకావాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ (మైటీ) కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రമുഖుల ఖాతాలకు సంబంధించిన కంటెంట్ తొలగింపులు ఎలా జరుగుతున్నాయి, వాటి వెనుక ఉన్న సాంకేతిక కారణాలేమిటి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత కోరుతోంది. ఇటీవల నీట్-యూజీ 2026 పరీక్షల అంశంపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగ వీడియోను సాంకేతిక లోపం కారణంగా తొలగించామని, తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని మెటా ఇప్పటికే వివరణ ఇచ్చింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!