
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జైలుకు వెళ్లిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్‌కు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించబడిందని, అయితే జగన్ సాయంత్రం 5 గంటల తర్వాత జైలు వద్దకు చేరుకున్నారని తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారమే ములాఖత్‌కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
జగన్ పర్యటన వెనుక అసలు ఉద్దేశం సీదిరి అప్పలరాజును కలవడం కాదని, రాజకీయ ప్రచారం మరియు బలప్రదర్శన చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని హోంమంత్రి విమర్శించారు. జైలు అధికారులు పూర్తిగా నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!