

ఏఐ సాంకేతికత అభివృద్ధితో సైబర్ నేరాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకప్పుడు నిపుణులకే పరిమితమైన హ్యాకింగ్ ఇప్పుడు ఏఐ సాయంతో సాధారణ వ్యక్తులకూ అందుబాటులోకి వచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులు 400 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనరేటివ్ ఏఐ కారణంగా ఫిషింగ్ మెయిల్స్, డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్ వంటి మోసాలు మరింత నిజమైనట్లుగా కనిపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ సాంకేతికత వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోంది.
ప్రాంప్ట్ ఇంజెక్షన్, ఏజెంటిక్ ఏఐ, పాస్‌వర్డ్ క్రాకింగ్ వంటి సాంకేతికతలతో సైబర్ నేరగాళ్లు మరింత శక్తివంతంగా మారుతున్నారు. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా ఉన్నప్పటికీ డిజిటల్ భద్రతపై అవగాహన తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఏఐ ముప్పులను ఎదుర్కొనే అధునాతన భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా ప్రతి ఫోన్‌కాల్, మెయిల్, డిజిటల్ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!