
బిజినెస్

బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఆవులు, దూడలను వధించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యంతర ఉపశమనం కల్పించింది.
రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్ట పరిస్థితుల్లో గోవధకు అనుమతి ఉన్నప్పుడు, దానికి విరుద్ధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్టబద్ధంగా నిలవవని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ వాటి అమలుపై తాత్కాలికంగా స్టే విధించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!