
సినిమాలు

అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ రూరల్ రివెంజ్ డ్రామా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో కీలక విజయంగా నిలిచింది.
నిర్మాత నాగ వంశీ వెల్లడించిన వివరాల ప్రకారం, 'లెనిన్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తొలి వారాంతంలోనే లాభాలు పొందేలా వ్యాపారాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించామని తెలిపారు. ప్రేక్షకుల ఆదరణకు, పంపిణీదారుల నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!