

అన్ని రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుండగా ప్రతి రోజూ కొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఉద్యోగాలు పోతాయన్న భయాలు ఉన్నప్పటికీ తాజా నివేదికలు ఆ ఆందోళనలను తగ్గిస్తున్నాయి. ఏఐతో ఉద్యోగాలు తగ్గడం కాకుండా మార్పులు చోటుచేసుకుంటున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 41 శాతం ఉద్యోగులు రోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో అనేకసార్లు వినియోగిస్తున్నారు.
ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ మాట్లాడుతూ, సంస్థలు ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలు చూపుతూ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సేవా రంగ ఆధారిత భారత్‌లో ఆపరేషనల్ పనుల్లో లక్షలాది మంది ఉన్నారని, వారికి కొత్త నైపుణ్యాలు నేర్పడం సంస్థల బాధ్యత అని తెలిపారు. “పీపుల్ అట్ వర్క్ 2026” నివేదిక ప్రకారం ఏఐ ఉత్పాదకతను పెంచి నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!