
జనరల్

ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని డెల్ సీఈఓ మైఖేల్ డెల్ తెలిపారు. లాస్ వేగాస్లో జరిగిన డెల్టెక్నాలజీస్ వర్ల్డ్ సదస్సులో మాట్లాడుతూ, డేటా సెంటర్లు, కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సర్వర్లు ఇప్పుడు రక్షణ, సెమీకండక్టర్లు, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలంతే కీలకమని పేర్కొన్నారు.
భారత్లో ఏఐ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని, దేశంలో ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి డెల్ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని మైఖేల్ డెల్ వెల్లడించారు. ఎన్విడియా చిప్స్ ఆధారిత ఏఐ సర్వర్ల మార్కెట్లో డెల్ కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 5 వేలకుపైగా ఏఐ ఫ్యాక్టరీ కస్టమర్లు ఉన్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!