
జనరల్

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ నేరగాళ్లు కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో వేల సంఖ్యలో పాటలను రూపొందించి స్పాటిఫైలో అప్లోడ్ చేసిన ముఠాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పాటల పేర్లు, వివరణలు, లిరిక్స్లో డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన కోడ్ భాషను ఉపయోగించి కొనుగోలుదారులను డీలర్లతో అనుసంధానించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ప్రమాదకర మాదకద్రవ్యాల విక్రయాలను ప్రోత్సహించడమే ఈ నెట్వర్క్ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పాటిఫై 57,000కు పైగా ఎపిసోడ్లను తొలగించడంతో పాటు సుమారు 3,500 ఖాతాలను రద్దు చేసింది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న కొత్త ధోరణికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!